డిప్యూటీ సీఎం గా సీఎం తనయుడు…?
తమిళ నాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తనయుడు. ప్రస్తుతం క్రీడా యువజన శాఖ మరియు చెన్నై మెట్రో రైల్ ఫేజ్ -2 వంటి కార్యక్రమాలను చూస్కుంటున్న ఉదయనిధి స్టాలిన్ ను నియమిస్తున్నట్లు సీఎం స్టాలిన్ తెలిపారు.
ఈ క్రమంలో రేపు ఆదివారం మధ్యాహ్నాం మూడున్నర గంటలకు ఉదయ నిధి స్టాలిన్ తమిళ నాడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.