సీఎం రేవంత్ దృష్టికి సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు..1

 సీఎం  రేవంత్  దృష్టికి సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు..1

CM Revanth’s attention to the problems of comprehensive punishment employees..1

తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న 19,300 మంది సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి అన్నారు.

సోమవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో చిన్నారెడ్డితో సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు. సమస్యల పరిష్కారం కోసం గత వారం రోజుల నుంచి సమ్మె చేస్తున్న తమకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని వారు చిన్నారెడ్డిని కోరారు.

సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, అప్పటివరకు ఉద్యోగ భద్రతతో కూడిన పే స్కేల్ ఇవ్వాలని, ఉద్యోగుల రీ ఎంగేజ్ విధానాన్ని తీసివేయాలని, ప్రతి ఉద్యోగికి బీమా సౌకర్యం కల్పించాలని పదవీ విరమణ చేసిన వారికి బెనిఫిట్స్ ఇవ్వాలని వారు చిన్నారెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.ఈ భేటీలో మాజీ ఎమ్మెల్సీ బి మోహన్ రెడ్డి, పిఆర్టియు రాష్ట్ర మాజీ అధ్యక్షులు పి వెంకట్ రెడ్డి, పిఆర్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, సహా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి, ప్రధాన కార్యదర్శి ఝాన్సీ సౌజన్య, తదితరులు పాల్గొన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *