బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై సీఎం రేవంత్ పొగడ్తల వర్షం..!

anumula revanth reddy
శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ని అసెంబ్లీ లోని సీఎం చాంబర్ లో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కలిసి నియోజకవర్గంలో ఉన్న పలు సమస్య లపై వివరించారు. దుబ్బాక వెనుకబడి ఉంది.. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ ఇప్పటివరకు కాలువలు పూర్తికాలేదు. కాలువల నిర్మాణానికి రూ.200 కోట్ల నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం “నీవు వివాదాలకు పోవు.. ఎవరితెరువు రావు.. నీవు సౌమ్యుడివి… నీకేమి అడ్డేమీ ఉంటదే.. నేరుగా వచ్చి పనులు చేయించుకో.. నిన్నుకాదంటానే ప్రభాకరన్నా..” అంటూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్తప్రభాకర్ రెడ్డి ని ఉద్దేశించి అన్నారు.
తాను వీలు చేసుకుని సిద్దిపేటకు వచ్చి, మల్లన్నసాగర్ కాలువల నిర్మాణం పనులపై సమీక్ష జరుపుతానని ఆయన హామీనిచ్చారు. దుబ్బాక నియోజకవర్గంలోని రహదారుల సమస్యలను వివ రించారు. రుణమాఫీ హామీ లు పూర్తికాగానే నిర్మాణాత్మక మైన అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తామని కూడా చెప్పారు. పార్టీల తీతంగా నిధులు కేటాయించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సీఎం రేవంత్ తెలిపారు.
రాష్ట్రం లో 20 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపడు తున్న యంగ్ఇండియా స్కిల్ యూనివర్శిటీని దుబ్బాకలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మెదక్-ఎల్కతుర్తి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న హబీపూర్ నుంచి దుబ్బాక, లచ్చపేట రహదారి విస్తరణకు రూ.35కోట్లను హెచ్ఎఎం ద్వారా సెంట్రల్ లైటింగ్తో కూడిన రహదారిని ఏర్పాటు చేయడానికి నిధులను మంజూరు చేస్తానని హామీ నిచ్చారు. యంగ్ఇండియా స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటుకు స్థలసేకరణకు చర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారులకు ఆదేశాలను ఇచ్చారు.
