బీజేపీ ఎంపీకి సీఎం రేవంత్ రెడ్డి హామీ..!

Director’s land seized during Congress rule..!
బీజేపీ ఎంపీ.. మాజీ మంత్రి డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు ప్రవేశించి కల్లోలం సృష్టించిన సంగతి తెల్సిందే. కేంద్ర హోం శాఖ సహయక మంత్రి బండి సంజయ్ డీజీపీకి కాల్ చేసి ఎంపీ ఇంట్లో జరిగిన సంఘటనపై ఆరా తీశారు.
అంతేకాకుండా తగిన భద్రతను కల్పించాలని కూడా సూచించారు. ఈ సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీశారు. ఎంపీని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
భద్రత పెంచుతామని ఆమెకు హామీకి ఇచ్చారు. ఈ ఘటనలో విచారణ వేగవంతం చేసి వాస్తవాలు తేల్చాలని పోలీసులను సీఎం ఆదేశించారు. భద్రత పెంచాలని పోలీస్ శాఖకు సూచించారు.
