సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం…!

anumula revanth reddy
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి ఓ ప్రమాదం తప్పింది. ఈరోజు మంగళవారం శంషాబాద్ లో జరిగిన సీఎల్పీ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి నోవాటెల్ హోటల్ కు వెళ్లారు.
ఈ క్రమంలో ఆయన ఎక్కిన లిప్ట్ లో సాంకేతిక సమస్య ఎదురైంది. ఆ లిప్ట్ లో రేవంత్ తో పాటు ఎక్కువ మంది ఎక్కడంతో ఓవర్ వెయిట్ కారణంగా దిగాల్సిన చోట ఆగకుండా రెండు అడుగులు కిందికి దిగింది లిప్ట్.
నార్మల్ గా ఎనిమిది ఎక్కాల్సిన లిప్ట్ లో పదమూడు నుండి పదిహేను మంది ఎక్కడంతోనే ఈ సమస్య తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు లిప్ట్ నుండి రేవంత్ ను క్షేమంగా బయటకు తీశారు.
