రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

CM Revanth Reddy’s key statement on farmer assurance..!
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రైతు భరోసాపై కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” రైతు భరోసా అమలుపై ఎవరికి ఎలాంటి ఆపోహాలు అవసరం లేదు.
ఈ పథకంపై ఎలాంటి అనుమానాలు సైతం అవసరం లేదు. రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతోనే ఈ పథకాన్ని తీసుకోస్తున్నాము. వచ్చేడాది సంక్రాంతి తర్వాత రైతుభరోసా డబ్బులు ఆయా రైతుల ఖాతాల్లో పడతాయని అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ ” గత ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన రైతుబంధు పథకం రైతులకంటే మిగతావాళ్లకు ఉపయోగపడింది. రైతుబంధు అమల్లో భాధ్యతారహితంగా వ్యవహరించారు. గతంలో రహదారులకు సైతం రైతు బంధు ఇచ్చారు. క్లసర్, మైనింగ్ భూములకు సైతం రైతుబంధు ఇచ్చారు. సాగులేని భూములకు దాదాపు 21 వేల కోట్లను రైతుబంధు కింద ఇచ్చారు. మేము అలాంటి తప్పులను చేయకుండా రైతుభరోసా పథకాన్ని పకడ్బంధిగా అమలు చేసి తీరుతాము అని అన్నారు.
