వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వహక్కులు ఉంటాయి.. వర్గీకరణ వల్ల విద్య ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ ఉప కులాలకు ఎంతో లాభం చేకూరుతుంది.. వెంటనే వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పునిచ్చిన సంగతి తెల్సిందే..
సుప్రీం కోర్టు తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “ఎస్సీ ఎస్టీ వర్గీకరణను తెలంగాణలో అమలు చేస్తాము. ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్.. ప్రభుత్వం కాంగ్రెస్..
అవసరమైతే ఇప్పటికే విడుదల చేసిన ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లలో వర్గీకరణ రిజర్వేషన్లు అమలు చేసేలా ఓ ప్రత్యేకమైన ఆర్డినెన్స్ తీసుకోస్తామని ఆయన ప్రకటించారు. ఇలాంటి సంచలనమైన తీర్పునిచ్చిన సుప్రీం కోర్టుకు ప్రత్యేక కృతజ్ఞతలు.. ఈ తీర్పును ఉపయోగించుకుని మాదిగ ఉప కులాలకు న్యాయం చేస్తామని”ఆయన అసెంబ్లీలో ప్రకటించారు.