స్థానిక ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

మర్రి చెన్నారెడ్డి భవన్ లో జరుగుతున్న సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవం చేయాలి.
అత్యధిక గ్రామ పంచాయితీలను ఏకగ్రీవం చేయాలి. గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన .. తాగునీటి వసతులు.. సీసీ బీటీ రోడ్ల నిర్మాణం..ఆలయ నిర్మాణాలను సహాకరించాలి.
నిధుల కోసం స్థానిక సంబంధిత మంత్రులను కలవాలి.. ప్రజలకు అందుబాటులో ఉండాలి.. పార్టీ నేతలను.. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని సూచించారు.
