సీఎం రేవంత్ రెడ్డి జైలుకెళ్ళే ప్రమాదం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జైలుకెళ్ళే ప్రమాదం ఉందని సీపీఐ సీనియర్ నాయకులు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” హైదరాబాద్ మహానగరంలో అక్రమణలకు గురైన చెరువులు,ప్రభుత్వ భూముల పరిరక్షణకై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకోచ్చిన ” హైడ్రా” వ్యవస్థ బాగుంది.
నగరంలో అక్రమ కట్టడాలు.. నిర్మాణాలను హైడ్రా కూల్చివేతలను సమర్ధిస్తున్నాను. అయితే హైడ్రా ఏర్పాటుతో సీఎం రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేయడం ప్రారంభించారు. ఒకవేళ స్వారీ ఆపితే పులి తినేస్తుంది ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.
హైడ్రా కూల్చివేతలతో బడా బాబులైన జైలుకెళ్తారు . లేదా వారి ఒత్తిళ్ళతో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అయిన జైలుకెళ్తారు. ప్రభుత్వ భూములను,చెరువులను పరిరక్షించి భవిష్యత్తు తరాలకు అందజేయడం ప్రభుత్వం యొక్క ప్రధమ కర్తవ్యం..ఈ కర్తవ్యాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్ధనీయంగా నిర్వర్తిస్తున్నాడని నారాయణ రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు.