ఎమ్మెల్యే దానం నాగేందర్ కు మద్ధతుగా సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పరుషపదజాలంతో దూషించిన సంగతి తెల్సిందే.. ఈ అంశంపై సభలో పెద్ద దుమారమే లేచింది.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” మూడు దశాబ్ధాల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ శాసన సభ్యుడు దానం నాగేందర్ మాట్లాడోద్దు అని చెప్పడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ.?. ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో ప్రజలు ఓడగొట్టిన ఇంకా బుద్ధి రాలేదు.. సభలో అరడజను ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తేనే వీళ్లకు సిగ్గు రాదనుకుంట..
దానం నాగేందర్ మాట్లాడిన దాంట్లో తప్పు ఏముంది.. సభలో అవమానిస్తుంటే దానం చూస్తూ కూర్చోవాల్నా.. దానం నాగేందర్ మాట్లాడిన మాటల్లో తప్పు లేదంటూ” మద్ధతుగా ఇచ్చినట్లుగా వ్యాఖ్యానించారు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు స్పందిస్తూ పైవోడు ఎలా ఉంటే కిందోడు అలానే ఉంటాడు. త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారు అని కౌంటర్ ఇచ్చారు..