ఫ్రీ బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న తీరుపై అధ్యయనం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో కూడిన కమిటీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక రూపొందించాలని సూచించారు.
కొంత ఆలస్యమైనా లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ఈ నెల 15 నుంచే ఈ స్కీమ్ అమలు చేస్తామని మంత్రులు గతంలో చెప్పిన విషయం మనకు తెలిసిందే.