బాబు రేవంత్ భేటీ అంశాలపై క్లారిటీ
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో జరిగిన భేటీలో టీటీడీలో వాటా, కోస్టల్ లైన్ గురించి చర్చ జరగలేదు.. అది మీడియా ఊహాగానం మాత్రమే అని మీడియా సమావేశంలో ఇరు రాష్ట్రాల మంత్రుల బృందం క్లారిటీ ఇచ్చారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో డ్రగ్స్ & సైబర్ నేరాల గురించి మాత్రమే చర్చలు జరిగాయి. టీటీడీలో వాటా, కోస్టల్ లైన్ గురించి చర్చ జరగలేదు.
రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్‌లో ఉన్న సమస్యలను అధికారిక కమిటీ పరిష్కరిస్తుంది. ఒకవేళ కమిటీ పరిష్కరించడంలో విఫలమైతే మంత్రుల కమిటీ పరిశీలిస్తుంది. మంత్రుల కమిటీ విఫలమైతే పెండింగ్‌లో ఉన్న సమస్యలను సీఎంల కమిటీ పరిష్కరిస్తుంది అని తెలిపారు..