సోమేష్ కుమార్ కు సీఐడీ నోటీసులు

Somesh Kumar
కేసీఆర్ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన ఐఏఎస్ అధికారి మాజీ సీఎస్ సోమేష్ కుమార్. అలాంటి అధికారి సీఐడీ నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వంలో వస్తువులు సరఫరా చేయకపోయిన కానీ సరఫరా చేసినట్లు బోగస్ ఇన్ వాయిస్ లను సృష్టించి జీఎస్టీ ఎగవేతతో భారీ అవినీతి జరిగిందని సోమేష్ కుమార్ తో పాటు పలువురి అధికారులపై అవినీతి ఆరోపణలున్నాయి.
ఈ ఆరోపణలపై మాజీ సీఎస్ సోమేష్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమీషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వేరరావు, ఏ2 గా శివరామ్ ప్రసాద్, ఏ3 గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ4 గా ప్లియంట్స్ టెక్నాలజీస్ కంపెనీలకు సీఐడీ నోటీసులు జారీ చేసింది..
తన శాఖలో భారీ అవినీతి జరిగిందని వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమీషనర్ రవి పిర్యాదు మేరకు రాష్ట్ర సీఐడీ నోటీసులు జారీ చేసింది. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమేష్ కుమార్ పై పలు అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే.
