త్రినయని నటుడు చందు ఆత్మహత్య
 
					
     
ప్రముఖ సీరియల్ నటుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ మహానగరంలోని మణికొండలో ఈరోజు చోటు చేసుకుంది .
మణికొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం త్రినయని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నారు.
అయితే ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయన , సీరియల్ నటి పవిత్ర జయరాం మరణించిన విషయం మనకు తెలిసిందే.
మరోవైపు నటుడు చందుకు భార్య శిల్ప, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పవిత్ర జయరాంతో కూడా పెళ్లయినట్లు తెగ వార్తలు వచ్చాయి. కాగా రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం వంటి సీరియల్స్ లో ఆయన నటించారు.
 
                             
                                     
                                    