అందరూ ఎదగాలన్నది చంద్రబాబు ఆకాంక్ష..!

Pawan Kalyan
4 total views , 1 views today
ఏపీకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎం గా లేకపోతే P-4 కార్యక్రమం ఉండేది కాదు. నాలో సరైన సత్తా లేక ఓట్లు చీలిపోతాయని చంద్రబాబుకు మద్దతు ఇచ్చాను అని జనసేన అధినేత .. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు…ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది 2025 సందర్భంగా “జీరో పావర్టీ-P4” కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ సత్తా లేనప్పుడు ప్రజలకు మేలు చేసే వాళ్లకు సపోర్ట్ చేయాలని చేశాను. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం స్వర్ణాంధ్ర అవుతోంది.
ఏ ప్రభుత్వం కూడా ఇంత బలమైన కార్యక్రమం చేయలేదు. ఈరోజు చంద్రబాబు సీఎం కాకపోతే రాష్ట్రం ఏమైపోయేది? చంద్రబాబు కూడా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చారు. అందరూ ఎదగాలన్నది చంద్రబాబు, నా ఆకాంక్ష.పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకే పీ-4 కార్యక్రమాన్ని చేపట్టామని స్పష్టం చేశారు. జీరో పేదరికం సాధించడమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వం “జీరో పావర్టీ పీ-4 మార్గదర్శి-బంగారు కుటుంబం” కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
పి-4 పథకం అంటే డబ్బులు ఇచ్చేయడం కాదని, పీ-4 అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్ షిప్ తో అభివృద్ధి సాధించడమని అన్నారు. ఈ పథకం కోసం 30 లక్షల కుటుంబాలను గ్రామ సభల ద్వారా ఎంపిక చేశామని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వ్యాపార సంస్థలను వాటాలు అడిగితే…కూటమి ప్రభుత్వం అట్టడుగున ఉన్న ప్రజలకు తమ ఎదుగుదలలో వాటాలు కల్పించమని అడుగుతోందని అన్నారు. “ సరిగ్గా ఏడాది క్రితం నేను, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఓ కార్యక్రమంలో పాల్గొన్నాం. తెలుగు ప్రజలు ఎక్కడున్నా బాగుండాలనేదే మా ఇద్దరి ఆకాంక్ష. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కూడా కూటమిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు కనుకే 164 శాసనసభ స్థానాలు, 21 పార్లమెంట్ సభ్యులను గెలిచాం. ప్రజలే కనుక అండగా నిలబడకపోతే ఇంతటి ఘన విజయం సాధ్యమయ్యేది కాదు.
