లెక్క తప్పిన చంద్రబాబు…లెక్క తేల్చమంటున్న జగన్
ఏపీ రాజకీయాలతో పాటు యావత్ దేశ రాజకీయలను ఒక కుదుపు కుదిపిన తాజా హాట్ టాపిక్ తిరుమల తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అనే అంశం.. ప్రస్తుతం ఈ అంశం ఇటు రాజకీయ పరంగా అటు మతపరంగా చిచ్చు రాజేసుకుంటున్న తరుణంలో వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఏకంగా ఈ ఇష్యూలో ఏది నిజం.. ఏది అబద్ధమో నిగ్గు తేల్చాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీకి లేఖ రాశారు.. బీజేపీ అధ్యక్షుడు నడ్డా దగ్గర నుండి కేంద్ర మంత్రి అమిత్ షా వరకు ఈ అంశంపై మాట్లాడారు.
తాజాగా జగన్ లేఖతో అది ప్రధాని దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి పదవిలో ఉండి.. అధికారంలో ఉండి మరి తిరుపతి లడ్డూలో కొవ్వు కలిసిందని ఎలాంటి నిరూపణలు లేకుండా ఎలా చెప్తారు.. తానే స్వయంగా ఓ సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేయించవచ్చు.. లేదా సీబీఐ లాంటి స్వతంత సంస్థలతో విచారణ చేయాలని కోరవచ్చు.. అదేమి లేకుండా జగన్ & వైసీపీ పై లడ్డూ రాజకీయ చేయాలనే ఆరాటంలో చంద్రబాబు & టీమ్ లెక్క తప్పినట్లు ఆర్ధమవుతుంది.
ముందే తేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగా తన బాధ్యతగా మీడియా సమావేశం పెట్టి తాను ఎలాంటి తప్పు చేయలేదు.. తమ ప్రభుత్వంలో తిరుపతి ప్రతిష్ట పెరిగింది తప్పా దిగజారలేదు.. ఒకవేళ కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయంలో నిజముంటే చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.. ఆ తర్వాత తానే ప్రధానమంత్రి నరేందర్ మోదీకి లేఖ రాయడం లెక్క తేల్చే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. లడ్డూ పంచాయితీ మున్ముందు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి..