రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే షాకిచ్చిన చంద్రబాబు…?
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీ పర్యటనకెళ్లిన సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో సహా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జరిగిన భేటీలో తెలంగాణలో పని చేస్తున్న ఆంధ్రా క్యాడర్ ఐఏఎస్ అధికారులైన అమ్రపాలి, రోనాల్డ్ రాస్, వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, సృజన లాంటి ఐఏఎస్ అధికారులను ఏపీకి బదిలీ చేయాలని కోరారు. కోరడమే తడవు వెంటనే ఉత్తర్వులు కూడా జారీ చేసింది క్యాట్.
దీనిపై అమ్రపాలి బృందం హైకోర్టు దాక వెళ్లిన కానీ ఫలితం లేకుండా పోయింది. తెలంగాణలో సమర్ధ వంతంగా పని చేస్తున్న వీర్ని బాబు పట్టుబట్టీ మరి మాకు కావాలని అమిత్ షాను ఒప్పించి తీసుకెళ్లడం ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి షాకిచ్చినట్లైంది. ఏది ఏమైన గురువు లాంటి చంద్రబాబు శిష్యుడులాంటి రేవంత్ రెడ్డికి దిమ్మతిరిగే షాకిచ్చారని అంతా అనుకుంటున్నారు.