రూ.౩౩ లక్షల ఖర్చుతో సీ.సీ. రోడ్డు నిర్మాణం
సికింద్రాబాద్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నామని, ప్రస్తుత ప్రభుత్వ హయంలో సితాఫలమండీ ప్రభుత్వ కాలేజీ భవనాల నిర్మాణానికి నిధుల కొరత ఎదురు కావడం శోచనీయమని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫలమండీ డివిజన్ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను తీగుల్ల పద్మారావు గౌడ్ మంగళవారం ప్రారంభించారు.
జోషీ కాంపౌండ్ లో రూ.౩౩ లక్షల ఖర్చుతో సీ.సీ. రోడ్డు నిర్మాణం పనులను, టీ.ఆర్.టీ. కాలనీ పార్కు లో రూ.7 లక్షల ఖర్చుతో ఓపెన్ జిమ్ సామగ్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఉపకరించే కార్యక్రమాలను, అభివృద్ధి పనులను తాము చేపడుతున్నామని తెలిపారు. ప్రోటోకాల్ నిబంధలను పాటించక పోవడం సరికాదని స్పష్టం చేశారు.
జోషి కాంపౌండ్, టీ.ఆర్.టీ. క్వార్టర్స్ ప్రాంతాలను సమస్యల రహిత ప్రాంతాలుగా తీర్చి దిద్దితున్నామని తెలిపారు. సితాఫలమండీ కార్పొరేటర్ సామల హేమ మాట్లాడుతూ సితాఫలమండీ డివిజన్ లో అన్ని సమస్యలను స్థానిక శాసనసభ్యులు పద్మారావు గౌడ్ సహకారంతో పరిష్కరించామని తెలిపారు. బీ.ఆర్.ఎస్. నేత కరాటే రాజు, జోషి కాంపౌండ్ అధ్యక్షుడు రాజ సుందర్, ప్రధాన కార్యదర్శి సుబాష్, టీ.ఆర్.టీ. కాలనీ సంఘం నేతలు జుగ్ను శేఖర్, రాజేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.