నయనతారపై కేసు నమోదు..!
తమిళ ప్రముఖ హీరో ధనుష్ తనకు రూ.10కోట్లకు లీగల్ నోటీసులు పంపడంపై హీరోయిన్ నయనతార ‘మీరు మీ తండ్రి, సోదరుడి సాయంతో హీరో అయ్యారు. నేను నా రెక్కల కష్టంతో పైకొచ్చాను. నా జీవితంపై నెటిక్స్ డాక్యుమెంటరీ తీస్తోంది.
అందులో మీరు నిర్మించిన ‘నానుమ్ రౌడీ దాన్’ క్లిప్స్ వాడుకునేందుకు NOC అడిగితే రెండేళ్ల నుంచి తిప్పించుకుంటున్నారు. 3 సెకన్ల ఫొటోలకు రూ.10 కోట్లు కట్టాలా?’ అని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి మనకు తెల్సిందే. తాజాగా హీరోయిన్ నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్పై హీరో ధనుష్ మద్రాస్ హైకోర్టులో సివిల్ కేసు దాఖలు చేశారు.
తన అనుమతి లేకుండా నెటిక్స్ డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ ధాన్’ సినిమాకు సంబంధించిన విజువల్స్ వాడుకున్నారని పేర్కొన్నారు. ‘వండర్ బార్ ఫిల్మ్స్’ బ్యానర్పై ధనుష్ ఆ సినిమాను నిర్మించారు. ఇటీవల ఈ విషయంపై నయన్, ధనుష్ మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే.