MLA దానం నాగేందర్ పై కేసు నమోదు

Case registered against MLA Danam Nagender
ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులు దానం నాగేందర్ పై కేసు నమోదు అయింది.. ఓ ప్రభుత్వ స్థలం వ్యవహారంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా మరికొందరిపై జూబ్లీహిల్స్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నం.69 నందగిరిహిల్స్ లో జీహెచ్ఎంసీ కు చెందిన స్థల ప్రహరీని కొందరు కూల్చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గుర్తించారు. ఈ కూల్చివేతతో ఎమ్మెల్యేకు సంబంధం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ ప్రహరీ కూల్చివేత వల్ల రూ.10లక్షల నష్టం వాటిల్లిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.దీంతో ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా పలువురిపై కేసు నమోదు చేశారు..
