కేఏ పాల్ పై కేసు నమోదు
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ అంటే తెలియనివాళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదేమో.. అంతగా కేఏ పాల్ ప్రాచుర్యం పొందారు. తాజాగా ఎన్నికల్లో తనకు సీటు ఇస్తానని యాబై లక్షలు తీసుకోని ఇవ్వకుండా మోసం చేశాడని ఓ వ్యక్తి పోలీసులకు పిర్యాదు చేశారు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఎల్బీ నగర్ నియోజకవర్గ టికెట్ ఇస్తానని కేఏ పాల్ రూ.50 లక్షలు తీసుకున్నట్లు రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడకు చెందిన ఎస్. కిరణ్ కుమార్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రూ.30 లక్షలు ఆన్ లైన్ లో, మిగిలిన నగదును పలు దఫాలుగా చెల్లించినట్లు చెప్పారు. కానీ తనకు టికెట్ కేటాయించలేదని ఈసందర్భంగా పేర్కొన్నారు.