కాంగ్రెస్ పార్టీ లో కారు చిచ్చు…?

 కాంగ్రెస్ పార్టీ లో కారు చిచ్చు…?

Car break down in Congress party

తెలంగాణ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లో కారు చిచ్చు రాజుకుందా..? ఏడాదిలోనే కాంగ్రెస్ క్యాడర్ లో ముసలం మొదలైందా..? జంపింగ్ జపాంగ్ తో కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు మొదలయ్యాయా..? అంటే అవుననే సమాదానం గట్టిగా వినిపిస్తుంది.బీఆర్ఎస్ నుండి కాంగ్రేస్ లో చేరిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గంలో జరిగిన సంఘటనలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు.బీఆర్ఎస్ అత్యంత ప్రాదాన్యత ఇచ్చిన కడియం శ్రీహరి,పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి నేతలతో సహా మొత్తం 10 మంది బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు.అయితే అక్కడక్కడా పాత కొత్త గొడవలు జరిగినా సర్థుకుంటారులే అని కాంగ్రెస్ అదిష్టానం మిన్నకుండిపోయింది..

తాజాగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగారు.ఇందుకు కారణమూ లేకపోలేదు.గూడెం మహిపాల్ రెడ్డి పదేండ్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గా ఉన్నారు.ఇటివల కాంగ్రెస్ లో చేరారు.కాంగ్రేస్ లో చేరిన నాటినుండి కాంగ్రేస్ పాత క్యాడర్ ను పట్టించుకోవటం లేదని అక్కడ కాంగ్రెస్ కు ప్రాతినిద్యం కాటా శ్రీనివాస్ గౌడ్ ఆరోపిస్తున్నారు.గూడెం మహిపాల్ రెడ్డి చేరికను కాటా శ్రీనివాస్ ముందు నుండి వ్యతిరేఖిస్తూ వస్తున్నారు..

తాజాగా పార్టీలో బీఆర్ఎస్ క్యాడర్ ను ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ క్యాడర్ ను పూర్తిగా విస్మరిస్తున్నారని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను క్యాంపు కార్యాలయంలో పెట్టుకోకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోను పెట్టుకున్నాడని నిన్న క్యాంపు కార్యాలయంపై దాడి చేసారు కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు,కాంగ్రేస్ కార్యకర్తలు..10 ఏండ్లు ప్రతిపక్షంలో ఉండి మేం పోరాడితే అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరి తమపై జులుం ప్రదర్శిస్తున్నారని కాటా శ్రీనివాస్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేసారు.

దీనిపై స్పందించిన గూడెం కేసీఆర్ ఫోటో ఉంటే తప్పేంటి, రేవంత్ రెడ్డి ఫోటో నాకు ఇష్టం ఉంటే పెట్టుకుంటా అని సంచలన వాఖ్యలు చేసారు..దీంతో అగ్గికి ఆద్యం పోసినట్టైంది..కారు పార్టీ నుండి వచ్చిన గూడెం కాంగ్రేస్ లో చిచ్చు రాజేస్తున్నాడని చర్చ జరుగుతుంది.మరి ఈ కారు చిచ్చుపై కాంగ్రెస్ అదిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *