సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు సోమవారం సచివాలయంలో భేటీ అయింది..
ఈ భేటీలో అత్యవసర అంశాలను మాత్రమే చర్చించాలన్న సీఈసీ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా రుణమాఫీ, ఉమ్మడి రాజధానిపై చర్చించకుండా ఖరీఫ్ యాక్షన్ ప్లాన్‌పై చర్చించనున్నది.
అంతేకాకుండా ఈ విద్యాసంవత్సరంలో తీసుకోవాల్సిన చర్యలపై జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై . పది రోజుల పాటు వేడుకలు నిర్వహించే యోచనపై చర్చించనున్నది.