బుమ్రా ఓ రికార్డు..!
టీమ్ ఇండియా ‘పేస్’ గుర్రం జస్పీత్ బుమ్రా మరో అరుదైన రికార్డును సృష్టించారు. టెస్టుల్లో 20 లోపు సగటుతో 200 వికెట్లు సాధించిన తొలి బౌలర్ గా బుమ్రా చరిత్రకెక్కారు.
మొత్తం 44 మ్యాచుల్లో 19.46 సగటుతో ఆయన 202 వికెట్లు దక్కించుకున్నారు. టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని అందుకున్న భారత పేసర్ గానూ బుమ్రా రికార్డులకెక్కారు.