ఈటలకు బంఫర్ ఆఫర్
తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు..మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ఈరోజు కొలువుదీరుతున్న మోదీ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అందరూ భావించారు.
అయితే ఎవరూ ఊహించని విధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన జి కిషన్ రెడ్డి,కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన బండి సంజయ్ లకు కేంద్ర మంత్రులుగా ఆ పార్టీ జాతీయ అధిష్టానం అవకాశం కల్పించింది.
అయితే తాజాగా ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న కిషన్ రెడ్డి త్వరలోనే రాజీనామా చేస్తారు. ఆ పదవి ఈటల రాజేందర్ కు ఇస్తారని ఆ వార్తల సారాంశం..ఒకటి రెండు రోజుల్లోనే ఈటల రాజేందర్ అమిత్ షాను కలవనున్నారు అని సమాచారం.