తెలంగాణలో నకిలీ మద్యంపై బీఆర్ఎస్ నేత క్రిషాంక్ సంచలన ఆరోపణలు
తెలంగాణ రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ప్రవేశపెట్టి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ సర్కార్ అంటూ ఆరోపించారు బీఆర్ఎస్ యువనేత క్రిషాంక్.
మీడియాతో ఆయన మాట్లాడుతూతెలంగాణలో మద్యం అమ్మడానికి ఎవరికి అనుమతులు ఇవ్వలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు బుకాయిస్తున్నారు..మరోవైపు సోమ్ డిస్టిల్లరీస్ అని సంస్థ తెలంగాణలో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నామని ఈరోజు తెలిపింది.
మంత్రి జూపల్లి అబద్ధం ఆడుతున్నాడా? లేక సీఎం రేవంత్ మంత్రికి తెలియకుండా డీల్ చేస్తున్నాడా? తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ సవాల్ విసిరారు..