సత్తుపల్లిలో బీఆర్ఎస్ నిరసనలు..!
అసత్య ప్రచారాలతో సాధ్యం కానీ 420 హామీలతో అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము నేటికీ 420 రోజులు గడిచిన సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గంలో సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు,తల్లాడ,వేంసూరు పట్టణ, మండల బీఆర్ఎస్ నాయకులు ఆయా చోట్ల మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు….మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుచుకొని స్వరాష్ట్రాన్ని సాధించి ఆయన ఆశయాలకు స్ఫూర్తిగా గత పదేళ్ల కేసిఆర్ పరిపాలనలో సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో విప్లవాత్మకమైన పథకాల కోసం శ్రీకారం చుట్టి,తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగా మార్చి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి గా చేసిన ఘనత కేసీఆర్ ది.
దేశానికి వెన్నుముక అయిన రైతుకు తెలంగాణలో రేవంత్ సర్కార్ వరుస వెన్నుపోట్లు పొడుస్తుందని, రైతు భరోసా కింద 15000 ఇస్తామని నమ్మబలికి ఏడాది గడిచిన చివరకు రూ.6000 ఇస్తున్నారని వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టి రైతులు మళ్లీ అప్పులపాలు చేశారని, ఎరువులు విత్తనాలు కోసం మళ్లీ క్యూ లైన్లు, కరెంటు కోతలు,వరికి 500 బోనస్ పేరిట బోగస్ మాటలు ,ఇవన్నీ కపట కాంగ్రెస్ పాలనలో రైతన్నకు 420 రోజులు ఎదురైన చేదు అనుభవాల ఓవైపు,రుణమాఫీ మోసం మరోవైపు,పెట్టుబడి భారం తట్టుకోలేక ఇప్పటికీ 410 మంది పైగా రైతు మరణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైంది.మరోవైపు నేతన్నలకు ఇచ్చిన హామీలు కూడ నెరవేర్చలేదని చేనేత బతుకులు చితికిపోయాయని తెలిపారు.
మహిళలకు 2500 ఇస్తామన్నారని, కల్యాణ లక్ష్మి తో పాటు తులం బంగారం అందిస్తామని మోసం చేయడంలో ఆడబిడ్డలు రగిలిపోతున్నారని, వృద్ధులు వితంతువు పింఛన్లు రూ.4000 పెంచుతామని నమ్మబలికి అధికారంలోకి వచ్చారని, ఈ సంక్షేమ పథకాల ఇప్పటి వరకు ఉలుకు పలుకులేని లేదని సర్కార్ పై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు..
యువతకు రెండు లక్షల ఉద్యోగాలు హామీని, జాబ్ క్యాలెండర్ వాగ్దానాన్ని మొత్తంగా ముఖ్యమంత్రి గంగలో కలిపేసారని చివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం నింపిన ఉద్యోగాలను తన జేబులో వేసుకొని నీచ రాజకీయాలకు తెరదీశారని యువత భవిత అంధకారంలోకి నెట్టి క్షమించలేని పాపం చేశారని తెలియజేస్తూ ఈ అసమర్ధ ప్రభుత్వము కళ్ళు తెరిపించి ఈ దద్దమ్మ కాంగ్రెస్ కు దారి చూపించి, ఈ చేతకాని సర్కారుకు బుద్ధి ప్రసాదించి ఈ అసమర్ధ ముఖ్యమంత్రి జ్ఞానోదయం కలిగించమని మహాత్మా గాంధీకి వినతిపత్రం రూపంలో బీఆర్ఎస్ నాయకులు తెలియజేశారు..