కవిత బెయిల్ పిటిషన్ – జస్టీస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసులో గత ఐదారు నెలలుగా తీహార్ జైల్లో ఉన్న సంగతి తెల్సిందే. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి… ఆప్ నేత మనీష్ సిసోడియా మాదిరిగా నాకు బెయిల్ ఇవ్వాలని కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ రోజు ఉదయం నుండి జస్టీస్ బీఆర్ గవాయ్,జస్టీస్ విశ్వనాథ్ ధర్మాసనం విచారిస్తుంది. ఎమ్మెల్సీ కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ, ఈడీ తరపున ఎస్వీ రాజు వాదనలు విన్పిస్తున్నారు.
ఈ క్రమంలో ఈడీ తరపున వాదిస్తున్న ఎస్వీ రాజు “ఎమ్మెల్సీ కవిత తరచూ ఫోన్లు మార్చారు.తరచూ ఫోన్లను మార్చి డేటాను ఫార్మాట్ చేశారు.ఫోన్లో డేటా ఎక్కువైనప్పుడు డిలిట్ చేస్తాం.. ఫార్మాట్ చేయం.సాక్ష్యాలు,ఆధారాలను కవిత మాయం చేశారు.దర్యాప్తునకు కవిత ఈడీకి సహాకరించలేదు.ఆధారాలను తారుమారుచేసిన కవితకు బెయిల్ ఎలా ఇస్తారు” అని వాదనలు విన్పించారు.
“జస్టీస్ విశ్వనాథ్,జస్టీస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ “కవిత నిరక్షరాస్యులు ఏమి కాదు.కవిత ఎక్కడ సాక్ష్యులను బెదిరించారు. ఆధారాలు ఏవి…?.ఫోన్లు మార్చడంలో తప్పు ఏముంది.ఫోన్లో మెసేజ్స్ డిలిట్ చేయడం సహజమే . అందులో తప్పు లేదు.కవితకు సెక్షన్ -45 ఎందుకు వర్తించదు.అప్రూవర్ అరుణ్ పిళ్లె ఎందుకు స్టేట్మెంట్ ను ఉపసంహరించుకున్నారు” అని అన్నారు.