KTRకి షాకిచ్చిన 13మంది ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ..మాజీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తన్నీరు హారీష్ రావు,పద్మారావు గౌడ్,ప్రశాంత్ రెడ్డి,సంజయ్ కుమార్,సబితా ఇంద్రారెడ్డి,సునీత లక్ష్మారెడ్డి,మాణిక్ రావు తదితరుల బృందం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో కల్సిన సంగతి తెల్సిందే..
ఈ భేటీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి..సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్పీకర్ కు చదివి విన్పించారు..
మరోవైపు తమ నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ నియమనిబంధనలను పాటించకుండా తమ హక్కులను కాలరాస్తున్నారంటూ ఆధారాలతో స్పీకర్ కు విన్నవించారు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి,సునీత లక్ష్మారెడ్డి,పద్మారావు గౌడ్..
అయితే స్పీకర్ తో భేటీకి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించినకానీ లెక్క చేయకుండా పదమూడు మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం పలు అనుమానాలకు దారి తీస్తుంది..అయితే రేపో మాపో మరో పదిమంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్న సంగతి తెల్సిందే…