కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఏడుపు..?

Duddhila Sridhar Babu
పదేండ్లు అధికారాన్ని అనుభవించి.. ఒక్కసారిగా పదవులు.. అధికారాన్ని కోల్పోవడంతో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఏడుస్తున్నారు అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి పది పైసల పని చేయలేదు. పదేండ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని పంచుకున్నారు.
అందుకే ప్రజలు వాళ్లను ఇంట్లో కూర్చోబెట్టి.. మమ్మల్ని సచివాలయంలో కూర్చోబెట్టారు. ఇప్పటికైన బీఆర్ఎస్ నేతలు సోయిలోకి రావాలని ఆయన హితవు పలికారు. మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు ఇంకా మాట్లాడూతూ పది నెలల పాలనలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేశాము. ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించాము.
ఐదోందలకే ఉచిత సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నాము. ఏడాదిలోపే యాబై వేల ఉద్యోగాలను ఇచ్చాము.. తమది మాటల ప్రభుత్వం కాదు. చేతల ప్రభుత్వం .. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హమీని నెరవేర్చి తీరుతాము అని అన్నారు.
