బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలనం..!

BRS chief KCR sensation..!
తెలంగాణ భవన్ లో ఈరోజు బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే.. ఎంపీ.. మాజీ ఎమ్మెల్యే.. ఎంపీ.. మంత్రులు.. పార్టీ ప్రతినిధులతో బీఆర్ఎస్ అధినేత .. మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ఏఫ్రిల్ పదో తారీఖు నుండి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.
ప్రతి జిల్లా కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగాలని సూచించారు. టీఆర్ఎస్ ఆవిర్భావించి పాతికేండ్లు అవుతున్న నేపథ్యంలో ఏడాది పొడవుల సిల్వర్ జూబ్లీ వేడుకలను జరపాలని ఆదేశించారు. ఏఫ్రిల్ ఇరవై ఏడో తారీఖున పార్టీ ప్లీనర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని తప్పనిసరిగా ఉప ఎన్నికలు వస్తాయి. వాటికి సన్నద్ధంగా ఉండాలని క్యాడర్ ను సిద్ధం చేయాలని నేతలకు సూచించారు. పార్టీలకు సంబంధించి కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు కమిటీల ఇంచార్జ్ బాధ్యతలు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావుకు అప్పజెప్పారు.
