సీఎం అతిశీ వెనకంజ..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ముఖ్యమంత్రి అతిశీ వెనకంజలో ఉన్నారు . బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరి 3,325ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు.
ఉదయం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైన సంగతి తెల్సిందే. ఇప్పటివరకూ వెలువడుతున్న ఎన్నికల ఫలితాల ప్రకారం బీజేపీ 46చోట్ల.. ఆప్ 24చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకూ ఒక్కచోట కూడా ఆధిక్యంలో లేకపోవడం విశేషం.
మాజీ సీఎం.. ఆప్ కార్యదర్శి అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పర్వేశ్ వర్మ 1170ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నాడు.