స్థానిక ఎన్నికలు వాయిదా వెనక అసలు ట్విస్ట్ ఇదే..!

Break To Local Body Elections In Telangana
బుధవారం పోలీస్ కమాండ్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు ఖరారు చేస్తారని వార్తలు వచ్చాయి. గతంలో మంత్రులు.. ఎమ్మెల్యేలు సైతం ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. అందరూ సన్నద్ధమవ్వాలని తమ క్యాడర్ కు.. నాయకులకు సూచించారు. తీరా నిన్న బుధవారం భేటీ తర్వాత డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు మీడియా సమావేశంలో కులగణనపై రీ సర్వే చేస్తాము. దీనిపై వచ్చేనెలలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో బిల్లును పెట్టీ ఆమోదించి కేంద్రానికి పంపుతాము.
కలిసి వచ్చే పార్టీలతో కల్సి ఢిల్లీకెళ్ళి ప్రధానమంత్రి మోడీని కల్సి ఈ బిల్లును ఆమోదించేలా చేస్తామని ప్రకటించారు. దీంతో ఇప్పట్లో స్థానిక పంచాయితీ ఎన్నికలు లేనట్లే అని అందరికీ ఆర్ధమైంది. అయితే ఈ ఎన్నికలు వాయిదా పడటం వెనక అంతుచిక్కని రహాస్యం ఒకటి ఉందని గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ప్రస్తుతం ఎండలు మస్త్ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి అవస్థలు మెండుగా ఉంటాయి. మరోవైపు గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు నాలుగోందల ఇరవై హామీలను అమలు చేయకపోవడంతో పల్లెలు.. గ్రామాలు.. పట్టణాల్లో ఉన్న ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఉంది.
అది కాకుండా ముందు ఆరుగ్యారంటీల కోసం ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించారు. మళ్లీ రేషన్ కార్డులు.. ఇందిరమ్మ ఇండ్లు.. ఆత్మీయ భరోసాలాంటీ పథకాలకు మళ్లీ దరఖాస్తులు చేపట్టారు.. ఇవన్నీ చాలనట్లు కూలగణన పేరుతో మళ్లీ ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. ఎస్సీ వర్గీకరణ .. రిజర్వేషన్లు .. బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు.. కులగణనలో బీసీల జనాభా తగ్గడం ఇలాంటి పలు కారణాల వల్ల ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
ఇప్పుడు స్థానిక ఎన్నికలకెళ్తే పార్టీ తరపున బరిలోకి దిగే అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా రావు. అందుకే ఎన్నికలు వాయిదా వేయాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో.. నిన్న కమాండ్ సెంటర్ లో జరిగిన భేటీలో నిర్ణయించారు. అందుకే స్థానిక ఎన్నికలతో పాటు పంచాయితీ ఎన్నికలను వాయిదా వేసినట్లు తెలుస్తుంది..
