TDP వర్కింగ్ ప్రెసిడెంట్ గా బ్రాహ్మణి -బాబు క్లారిటీ

 TDP వర్కింగ్ ప్రెసిడెంట్ గా బ్రాహ్మణి -బాబు క్లారిటీ

Loading

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇటు నారా భువనేశ్వరి, అటు నారా బ్రాహ్మణి ఎన్నడూ ఆన్ రోడ్ కి రానివారు వచ్చి టీడీపీ గెలుపు కోసం ప్రచారం నిర్ణయం నిర్వహించారు.. మంగళగిరిలో మూడు దశబ్దాల తర్వాత టీడీపీ జెండా ఎగురవేశారు నారా లోకేష్.. లోకేష్ గెలుపు వెనక బ్రాహ్మణి ఉన్నారన్నది జగమెరిగిన సత్యం..

తాజాగా ఈరోజు శనివారం ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తల సమావేశం సందర్భంగా ఓ అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది.. సమావేశం తర్వాత టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై బాబు మీడియా కు వివరించారు…

ఈ క్రమంలో మీడియా మిత్రులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఓ మీడియా జర్నలిస్ట్ చంద్రబాబును టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను నారా బ్రాహ్మణి కి ఎప్పుడూ అప్పజెప్తున్నారు..?. అవకాశం ఉందా అని ప్రశ్నించారు.. దీనికి సమాధానంగా మీ అంత ఫాస్ట్ గా నా నిర్ణయాలు ఉండవు.. మాకంటే మీరే ముందు ఆలోచిస్తున్నారు.. మాకంటూ ఓ స్టాటజీ ఉంటుంది.. ముందే అది చెప్పరు.. మున్ముందు మీరే చూస్తారు అని నర్మగర్బంగా అవకాశం ఉంటదని పరోక్షంగా సమాధానమిచ్చారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *