మెగా హీరోతో బాలీవుడ్ బ్యూటీ రోమాన్స్ ..!

janhvi kapoor
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్.. అందాల రాక్షసి జాన్వీ కపూర్ హీరోయిన్ గా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ దేవర -1 లో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీచ్చిన సంగతి తెల్సిందే.
తాజాగా ఈ ముద్దుగుమ్మ మెగా హీరో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సరసన నటిస్తుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తుండంగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైయింది.
తాజాగా ఈ బ్యూటీ మరో సూపర్ చాన్స్ దక్కించుకుంది. ఐకాన్ స్టార్.. పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు జాన్వీ బేబీని తీసుకోవాలని మూవీ యూనిట్ భావిస్తోందని వార్తలు వస్తున్నాయి.ఈ వార్తలపై చిత్రం యూనిట్ అధికారక ప్రకటన చేయాల్సి ఉంది.
