కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదు

BJP is not against caste census
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీపై కాంగ్రెస్ నేతలు ఇష్టమోచ్చినట్లు మాట్లాడుతున్నారు.
కులగణనకు మేము వ్యతిరేకం కాదు. నిజంగా నిఖార్సుగా కాంగ్రెస్ కు పాలసీ ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గానీ, ఆ పార్టీ మిత్రపక్షాలు అధికారం లో ఉన్న రాష్ట్రాల్లో కులగణన ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటను తెలంగాణ ప్రజలు వినాలి.. అయన పనితీరు ఆధారంగా నే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
