కేసీఆర్ కు బర్త్ డే విషెస్..మంత్రిపై ట్రోలింగ్..?

KCR
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ,మాజీ మంత్రులు ,ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ హరీష్ రావు ముఖ్య నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు..పలువురు ప్రముఖులు కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి,ఏపీ డిప్యూటీ సీఎం పవణ్ కళ్యాణ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు..తెలంగాణలో సైతం పలువురు మంత్రులు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.. అయితే జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఓ మంత్రి తీవ్రంగా ట్రోల్ అవుతున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు..
ఆ మంత్రి ఎవరో కాదు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆయన కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ “గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు” అంటూ ప్రస్తావించారు అయితే కేసీఆర్ గారు రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేయడం, అతని హోదాను గౌరవించకుండా కేవలం ఎమ్మెల్యే అంటూ పేర్కొనడంతో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, కెసిఆర్ అభిమానులు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.. సంస్కారం లేకుండా కావాలనే కెసిఆర్ గారిని అగౌరవపరిచాలనే ఉద్దేశంతో పొన్నం ప్రభాకర్ అలా చేశారని తీవ్రంగా విమర్శిస్తున్నారు..
మరో మంత్రి శ్రీధర్ బాబు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ తెలిపారు. పొన్నం ప్రభాకర్ మాత్రం కేసీఆర్ ను గజ్వేల్ ఎమ్మెల్యే అంటూ మాత్రమే ప్రస్తావించడంతో ఈ దుమారం చలరేగింది..అయితే ఆయన ఉద్దేశపూర్వకంగా అన్నారా..? లేక యాదృచ్ఛికంగా అలా పోస్ట్ చేశారా తెలియాల్సి ఉంది..
