ఇందిరమ్మ ఇండ్లపై బిగ్ అప్ డేట్..!
ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిగ్ అప్ డేట్ ఇచ్చారు. ఈరోజు మంగళవారం సచివాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ” సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు మంది ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించాము. నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు లక్షల మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించాము.
తొలివిడతలో ఇందిరమ్మ ఇండ్లను దివ్యాంగులకు.. వితంతువులకు అవకాశం ఇస్తామని తెలిపారు. రేషన్ కార్డులతో సంబంధం లేకుండా సొంత స్థలం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇందిరమ్మ కమిటీలు అర్హులను ఎంపిక చేస్తాయని పేర్కొన్నారు.