వైసీపీకి గట్టి షాక్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ మాజీ మంత్రి.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది.. రెండు సార్లు మంత్రిగా పని చేసిన నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఒంగోలుకి చెందిన మాజీ మంత్రి.. మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డికి బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలినేని మాట్లాడుతూ ” అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలు నాకు నచ్చడం లేదు. అందుకే రాజీనామా చేస్తున్నాను అని జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. తాను రాసిన లేఖను నిన్న బుధవారం జగన్ కు ఫ్యాక్స్ చేశారు. బాలినేని ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
రెండు సార్లు మంత్రిగా పని చేశారు. వైఎస్ కుటుంబానికి బంధువు.. అత్యంత సన్నిహితుడు. గతంలో కాంగ్రెస్, వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరి అత్యంత క్రియశీలకంగా పని చేశారు. 2022లో మంత్రివర్గం నుండి తప్పించిన దగ్గర నుండి జగన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత ఎన్నికల్లో భారీ ఓటమితో మొత్తానికి పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. నిన్న బుధవారం జగన్ ను కల్సి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.