టీమిండియాకు భారీ షాక్..!

Big Shock To Team India
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఇంగ్లాండ్ జట్టుతో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా 22పరుగులతో తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు 1-2తో భారత్ పై ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో మిగతా టెస్టు మ్యాచులకు భారత్ యువ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి దూరమయ్యాడు.
మోకాలి గాయం కారణంగా తెలుగు కుర్రాడైన నితీశ్ కుమార్ రెడ్డి తిరిగి ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు రానున్నట్లు బీసీసీఐ తెలిపింది. మరోవైపు భారత్ బౌలర్ అర్ష్ దీప్ సైతం నాలుగో టెస్టు మ్యాచ్ లో ఆడటం లేదని, అతడి స్థానంలో అన్షుల్ కంబోజ్ ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ పేర్కొంది.
ఇప్పటికే సిరీస్ లో వెనకబడిన భారత్ కు ఆటగాళ్లు గాయాల బారిన పడి జట్టుకు దూరం కావడం పెద్ద దెబ్బేనని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. చూడాలి మరి మిగతా రెండు మ్యాచుల్లో భారత్ ఏమేరకు రాణిస్తుందో అని..!