కొడాలి నానికి బిగ్ షాక్
ఏపీ మాజీ మంత్రి..వైసీపీ సీనియర్ నేత కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు వాలంటీర్లను బలవంతంగా బెదిరించి రాజీనామా చేయించారని మాజీ మంత్రి కొడాలి నానిపై పోలీసులకు పిర్యాదు చేశారు వాలంటీర్లు.
ఎన్నికల సమయంలో తమను వేధించి బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ మాజీ వాలంటీర్లు ఫిర్యాదు చేయడంతో మాజీ మంత్రి కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు నేతలపై 447, 506, R/w34 ఐపీసీ సెక్షన్ల కింద గుడివాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.