కంగనా రనౌత్ కు Big Shock
Kangana’s sensational comments on the defeat of the Congress alliance in Maharashtra
![]()
బాలీవుడ్ హాట్ బ్యూటీ… బీజేపీ ఎంపీ అయిన కంగనా రనౌత్ కు బిగ్ షాక్ తగిలింది. సొంత పార్టీ అయిన బీజేపీ కంగనాకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ విధివిధానాల గురించి మాట్లాడే స్వేచ్చ కంగనాకు లేదని బీజేపీ హైకమాండ్ తేల్చి చెప్పింది.
రైతు ఉద్యమానికి సంబంధించి కంగనా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో ఆ పార్టీ జాతీయ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గతంలో ఆమె మాట్లాడుతూ రైతుల ఉద్యమంలో విధేశాల కుట్రలు దాగి ఉన్నాయి.
వారిని అదుపు చేయకపోతే ఇండియాలో కూడా బంగ్లాదేశ పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని కంగనా వ్యాఖ్యానించింది.ఇలా మాట్లాడినందుకే ఎయిర్ పోర్టులో ఓ మహిళ అధికారి కంగనాను చెంపదెబ్బ కొట్టిన సంగతి తెల్సిందే. అప్పట్లో ఈ వార్త తెగ వైరల్ కూడా అవ్వడంతో సదరు అధికారిణిని విధుల నుండి కూడా తప్పించారు.