హార్థిక్ పాండ్యాకు బిగ్ షాక్..!
టీమిండియా ఆల్ రౌండర్ గా ఒక వెలుగు వెలిగిన యువ ఆటగాడు హార్థిక్ పాండ్యా కు ఇక భవిష్యత్తులో నాయకత్వం వహించే అవకాశం లేనట్లేనా..?. టీమిండియా లెజండ్రీ ఆటగాడు రోహిత్ శర్మ తర్వాత వన్డే,టీ20 మ్యాచులకు నాయకత్వం వహించే తదుపరి సారధి అనే వార్తలకు ఇక ముగింపు పలికినట్లేనా..?.
అంటే అవుననే అంటున్నారు క్రీడా పండితులు. తాజాగా ఛాంపియన్ ట్రోఫీకి ప్రకటించిన టీమిండియా జట్టుకి రోహిత్ శర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.. వైస్ కెప్టెన్ గా శుభమన్ గిల్ కి అప్పజెప్పారు.. మరోవైపు టీ20లకు సూర్యకుమార్ యాదవ్ కు సారధి..అక్షర్ కు ఉప సారధి బాధ్యతలు అప్పజెప్పారు .
దీంతో టీమిండియాకు నాయకత్వం వహించే అవకాశలు ఇక లేనట్లే అని వారు చెబుతున్నారు.. ప్రస్తుతం నిలకడలేమి తనం..తరచూ గాయాలు పాలవ్వడం లాంటి విషయాలతో బీసీసీఐ దూరం పెడుతున్నట్లు ఆర్ధమవుతుంది.