పాలకుర్తి కాంగ్రెస్ లో రగడ

Hanumandla Jhansi Reddy & Yashaswini Reddy Hanumandla
అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు నానాటికి పెరిగిపోతుంది.. జనగామ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యేకి.. జిల్లా పార్టీ అధ్యక్షుడికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తాజాగా పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో అదే జోరు కొనసాగుతుంది. నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన యశశ్వసిని రెడ్డి అత్తగారైన హనుమండ్ల ఝాన్సీరెడ్డిపై ఆపార్టీకి చెందిన కార్యకర్తలే ఎదురుతిరిగారు.
జనగామ జిల్లా కోడకండ్ల గ్రామంలో పలువుర్ని పరామర్శించడానికి కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీరెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు గత ఎన్నికల్లో మీ కొడలి గెలుపుకై కార్యకర్తలు ఎంతగానో కృషిచేశారు. అహర్నిశలు కష్టపడ్దారు..
గెలిచాక.. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోవడం లేదు.. కార్యకర్తలతో మాట్లాడటానికి కూడా టైం ఉండటం లేదు. ఎన్నికల్లో మేము ఎంతో డబ్బులు ఖర్చు చేశాము.. అధికారంలో ఉన్న కూడా మాలాంటి కార్యకర్తలకు న్యాయం జరగకపోతే ఎలా అని నిలదీశారు. దీంతో చేసేది ఏమి లేక అక్కడ నుండి ఝాన్సీరెడ్డి కారు ఎక్కి వెళ్లిపోయారు.
