దేవర కు బిగ్ షాక్

 దేవర కు బిగ్ షాక్

Big Update Of Devara

Loading

పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా…. బాలీవుడ్ సెక్సీ బ్యూటీ ఫుల్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. ప్రకాష్ రాజ్, అజయ్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ రామ్ సమర్పణలో హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమై ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ దేవర..

ఈ మూవీకి సంబంధించిన టికెట్ల ధరలను పెంచుకోవడానికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఏపీలో పద్నాలుగు రోజుల పాటు పెంచుకోవచ్చు అని టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవో హైకోర్టును ఆశ్రయించారు కొంతమంది.

దీనిపై విచారించిన హైకోర్టు కేవలం పదిరోజుల పాటు మాత్రమే పెంచుకోవడానికి అవకాశమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. మరోవైపు ఏపీలో మల్టీప్లెక్సీలో ఒక్కొక్క టికెట్ పై రూ. 135, సింగల్ స్క్రీన్ అప్పర్ క్లాస్ లో ఒక్కొక్క టికెట్ పై రూ.110, లోయర్ క్లాస్ ఒక్కొక్క టికెట్ పై రూ.60వరకు పెంచారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *