టీమిండియాకు బిగ్ షాక్..!
ఆసీస్ పర్యటనలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా జట్టుకు నెట్ ప్రాక్టీస్ సెషన్లలో వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ చేతికి గాయమైంది.
తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా గాయపడినట్లు తెలుస్తుంది. ఎంసీజీ నెట్స్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ ఎడమ మోకాలికి బంతి బలంగా తాకింది.
దీంతో రోహిత్ శర్మ నొప్పితో పక్కన అలా చాలా సేపు కూర్చుండిపోయారు. చివరి టెస్ట్ మ్యాచ్ జరగడానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. కాబట్టి ఆలోపు రోహిత్ శర్మ కోలుకుంటారు. జట్టులో ఆడతారని టీమిండియా వర్గాలు భావిస్తున్నారు.