రేవంత్ సర్కారుకు బిగ్ షాక్..!

Anumula Revanth Reddy
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంలో హైకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిన సంగతి మరిచిపోకముందే తాజాగా దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు రేవంత్ రెడ్డి సర్కారుకు బిగ్ షాకిచ్చింది.
హెచ్ సీయూ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ విచారణలో ప్రభుత్వం విక్రయించాలని తలపెట్టిన భూములను ఈరోజు మధ్యాహ్నాం మూడున్నరకు వెళ్లి సందర్శించాలి. అక్కడి వాస్తవ పరిస్థుతులపై నివేదికను తయారు చేసి అందించాలని హైకోర్టు రిజిస్ట్రార్ ను సుప్రీం కోర్టు ఆదేశించింది. దాదాపు ముప్పై ఏండ్లుగా ఆ భూమి వివాదంలో ఉంది.
అటవీ భూమి అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ ఆ భూముల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని సీఎస్ కు సుప్రీం కోర్టు ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు నిన్న హైకోర్టు ఈరోజు మధ్యాహ్నాం రెండున్నర వరకు ఎలాంటి కూల్చివేతలు.. కార్యక్రమాలు నిర్వహించకూడదని ఆదేశించిన దాదాపు వందలాది జేసీబీలతో అక్కడున్న చెట్లను నరికేసిన సంగతి మనకు తెల్సిందే.