మోహన్ బాబు కు బిగ్ షాక్..!
సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు మోహాన్ బాబు కు హైకోర్టు బిగ్ షాకిచ్చింది. ఇటీవల తన ఫామ్ హౌస్ లో జరిగిన ఓ ఘటనలో ప్రముఖ తెలుగు న్యూస్ మీడియాకు చెందిన టీవీ 9 జర్నలిస్ట్ రంజిత్ పై మోహన్ బాబు మైకుతో దాడికి దిగిన సంగతి తెల్సిందే.
ఈ ఘటనలో రంజిత్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈకేసులో మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు.
దీనిపై బెయిల్ గురించి మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. దీంతో మోహన్ బాబును అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నట్లు టాక్.