మేఘా కంపెనీకి బిగ్ షాక్..!

Big shock for Megha company..!
ప్రముఖ మేఘా కంపెనీకి బిగ్ షాక్ తగిలింది. ఇందులో భాగంగా మేఘా కంపెనీ పై సైబర్ ఎటాక్ జరిగింది.ఇందులో భాగంగా నకిలీ ఈమెయిల్ ద్వారా 5 కోట్ల 47 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్ళు కొట్టేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
దీంతో ఆ సంస్థ అకౌంట్ మేనేజర్ శ్రీహరి సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఫిర్యాదు చేశారు.మేఘా కంపెనీకి అవసరమైన ఎక్విప్మెంట్ నెదర్లాండ్స్ కి చెందిన ఓ కంపెనీకి ఆర్డర్స్ ఇచ్చారు.ఆ కంపెనీకి ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లింపులు చేశారు.చెల్లింపుల తర్వాత ప్రతిసారి కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చేది.అయితే ఇక్కడే ఆ కంపెనీ లాగానే ఈ-మెయిల్లో ఒక అక్షరం మార్చి.. కొన్ని కారణాలవల్ల మీరు పంపించే అకౌంట్ పనిచేయడం లేదు..
మరో అకౌంట్ కి డబ్బులు చెల్లించాలంటూ మేఘా కంపెనీకి సైబర్ నేరగాళ్లు మెయిల్ పంపారు. దీంతో అది నిజమని నమ్మి 5 కోట్ల 47 లక్షలు రెండు విడతలుగా మేఘా కంపెనీ చెల్లించింది. అయితే అదే కంపెనీ నుండి మరో మెయిల్ డబ్బులు ఇంకా చెల్లించలేదని మెయిల్ వచ్చింది.. దీంతో తాము మోసపోయామని గ్రహించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో మేఘా కంపెనీ పిర్యాధు చేసింది.
