జగన్ కు బిగ్ షాక్..!

YS Jagan Mohan Reddy Andhrapradesh Former Cm
ఏపీ మాజీ ముఖ్యమంత్రి…. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఆయన తనయుడు ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి బిగ్ షాకిచ్చారు. ఈరోజు గురువారం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి బద్వేల్ లో పర్యటించారు. ఈ పర్యటనకు సంబంధించి వివరాలన్నీ ముందే రోజే ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆయన తనయుడు మిధున్ రెడ్డికి తెల్సు. కానీ జగన్ పర్యటన ఉన్నదని తెల్సి కూడా షిరిడీ వెళ్లారు.
అయితే గత కొంతకాలంగా పెద్దిరెడ్డి జగన్ తీరుపై.. తన పట్ల వ్యవహరిస్తున్న విధానంపై ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు అని తెలుస్తుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న తనను తప్పించడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. అంతేకాదు ఇటీవల జగన్ నియమించిన కోఆర్డినేటర్ల నియామకంపై కూడా ఆయన తీవ్ర అసహానంతో ఉన్నట్లు తెలుస్తుంది.
అందుకే తాను అసంతృప్తితో ఉన్నట్లు జగన్ కు తెలియాలనే బద్వేల్ జగన్ పర్యటన ఉన్నదని తెల్సి కూడా షిరీడీ కావాలనే వెళ్లారని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. జగన్ పర్యటన ఎప్పుడు ఎక్కడ ఉన్న రాయలసీమలో ముందు ఉండి నడిపించే పెద్దిరెడ్డి తాజాగా దూరంగా ఉండటం వెనక పలు అనుమానాలకు దారితీస్తుంది. ఇప్పటికైన జగన్ తన తీరు మార్చుకోవాలని వైసీపీ శ్రేణులు.. పెద్దిరెడ్డి అనుచరులు కోరుకుంటున్నారు. లేకపోతే త్వరలోనే పెద్ద షాక్ తగలడం ఖాయమని వారు గుసగుసలాడుకుంటున్నారు.
